పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అచ్చుగట్లపాలెం మారుతి సెంటర్ నందు ఉన్న శ్రీ లక్ష్మీ పిల్లల ఆసుపత్రిలో దుర్గారావు నైట్ డ్యూటీ చేస్తున్నాడు. రాత్రి 11.45 గంటల సమయంలో ఆసుపత్రిలోకి నలుగురు వ్యక్తులు చొరబడి దుర్గారావుపై దాడి చేసి ఆసుపత్రిలో ఉన్న మెడికల్ షాపులో సుమారు రూ.2 లక్షలు అపహరించుకుపోయారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ కె. రజనీకుమార్ తెలిపారు.
పోలీసులపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
ఏలూరు టౌన్: సోషల్ మీడియాలో పోలీసులపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా ఏలూరు త్రీటౌన్ సీఐ తన కారు వాడుకుంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి తెలిపిన వీడియో వైరల్‌గా మారింది. పోలీసులు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఏలూరుకు చెందిన గుప్తాగా గుర్తించి అతడి నుంచి వివరాలు సేకరించి అతడిని విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. తన కారును ఒక వ్యక్తి అద్దెకు తీసుకుని తాకట్టు పెట్టాడని, దీనిపై అప్పట్లో ఏలూరు త్రీటౌన్ సీఐకి ఫిర్యాదు చేయగా స్పందించకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసేందుకు మంగళగిరి వెళ్లినట్లు గుప్త తెలిపాడు. అయితే త్రీటౌన్ సీఐ కారు, తన కారు ఒకే రంగులో ఉండడంతో పొరబడి ఆయన తన కారును వాడుకుంటున్నారని భ్రమపడి మంగళగిరిలో విలేకరుల ముందు పొరపాటుగా చెప్పానని, క్షమించాలని పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment