217 అర్జీల స్వీకరణ
ఇద్దరు అరెస్ట్
ఏలూరు నగరంలో పలు కార్లను అద్దెకు తీసుకుని ఉడాయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు కార్లను రికవరీ చేశారు. 8లో u
ఏలూరు (మెట్రో): స్థానిక కలెక్టరేట్‌లో సోమ వారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో 217 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అధికారులు సొంత లాగిన్‌ను ఓపెన్ చేసి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా శ్రద్ధ తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, మున్సిపల్ కమిషనర్ ఎ.భానుప్రతాప్ పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన చింతల రవికుమార్ ప్రమాదవశాత్తు తనకు కాలుపోయిందని, ఉపాధి కల్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు అర్జీ అందజేశారు.
● విజయవాడ అర్బన్ పటమటకు చెందిన ఎం.సందీప్ నూజివీడులో తమకు ఉన్న వ్యవసాయ భూమికి పాస్ పుస్తకం ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు.
● వంగూరుకు చెందిన ధర్మరాజు తమ పొలానికి ఆనుకుని టేకుచెట్లు వేశారని దాని వల్ల తన పంట పొలం దెబ్బతింటోందని ఫిర్యాదు చేశారు.
● ముదినేపల్లి మండలం పేరూరుకి చెందిన రాజేష్ తమ భూమికి ఆన్‌లైన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాల్సిందిగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment