నేడు భూసమస్యలపై ప్రజా వేదిక
వేలేరుపాడు: కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశాల మేరకు వేలేరుపాడు మండల స్థాయిలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అన్నిరకాల భూసమస్యలపై మంగళవారం ప్రజావేదిక నిర్వహించనున్నట్టు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ తెలిపారు. భూసేకరణ యూనిట్–2 ఏలూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి, తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొని వినతులు స్వీకరిస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
రుద్రాక్ష మండపంలో ఊరేగింపు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం కావడంతో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి గంగా, పార్వతీ సమేత శివయ్య రుద్రాక్ష మండపంలో క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు.
27న సివిల్స్ శిక్షణకు స్క్రీనింగ్
ఏలూరు (టూటౌన్): సివిల్ పరీక్షల ఉచిత శిక్షణ కోసం ఈనెల 27న రాజమహేంద్రవరంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్‌వీ నాగరాణి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణకు జిల్లాలో 12 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి అదేరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు గంట ముందు రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్‌కు వెళ్లి రిపోర్ట్ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 7569184335లో సంప్రదించాలని కోరారు.
పక్కాగా ఓటర్ల నమోదు
ఏలూరు (మెట్రో): దోషరహిత ఓటరు జాబితాను రూపొందించడంపై సంబంధిత అధికారులు ధ్యాస పెట్టాలని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎంఎం నాయక్ చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై వీఆర్వోలు, ఏఈఆర్వోలతో ఆయన సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా కీలకమని, పక్కాగా జాబితా రూపొందించాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో రాజకీయపక్షాల ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అక్టోబరు 29 నాటికి 16,38,436 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. జిల్లాలో 1,744 పోలింగ్ స్టేషన్లు ఉండగా పరిశీలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment