టీడీపీ కార్యకర్త ఆగడాలను అడ్డుకోవాలని వినతి
నూజివీడు: టీడీపీ కార్యకర్త ఆగడాలను అడ్డుకోవాలని కోరుతూ ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసంలో రైతు జంగంగూడెంకు చెందిన కొల్లి సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు. తన భూమిలోని ఆయిల్‌పామ్ మొక్కలను 15 రోజుల క్రితం దేవరగుంటకు చెందిన టీడీపీ కార్యకర్త చేకూరి వెంకటరామయ్య దౌర్జన్యంగా పీకివేశాడని, పొలానికి వేసిన ఫెన్సింగ్ రాళ్లను విరగ్గొట్టడంతో పాటు ముళ్ల తీగను తొలగించాడని సత్యనారాయణ తెలిపారు. దీనిపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ఇటీవల మొక్కజొన్న సాగు చేయగా మళ్లీ ఆదివారం రాత్రి వెంకటరామయ్య ట్రాక్టర్‌తో పంటను ధ్వంసం చేశాడని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. డీఎస్పీ శ్రవణ్‌కుమార్ అర్జీని పరిశీలించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు బాధిత రైతు సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment