ఏలూరు టౌన్: అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మండలం జాలిపూడికి చెందిన కలగర అనీల్ కుమార్, పూర్ణిమ (30) దంపతులు. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. అనీల్‌కుమార్ స్థానికంగా ఉన్న ఓ సినిమా థియేటర్ క్యాంటీన్‌లో పనిచేస్తుంటాడు. పిల్లల చదువుల నిమిత్తం కొంతకాలంగా చాటపర్రులోని ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. ప్రస్తుతం అనిల్‌కుమార్ అయ్యప్ప మాల వేశారు. దీక్షలో ఉండటంతో 3 రోజులుగా జాలిపూడిలోని పీఠం వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో పూర్ణిమ, పిల్లలు ఆదివారం రాత్రి నిద్రించారు. సోమవారం ఉదయానికి పూర్ణిమ ఇంట్లోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. నిద్రలేచిన కుమార్తె విషయాన్ని గమనించి తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. విషయం తెలుసుకున్న ఏలూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కడుపునొప్పి తాళలేక, లేదా మరేదైనా కారణాలతో పూర్ణిమ ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం తెలియాల్సి ఉంది. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment