ఏలూరు (టూటౌన్): రైతులు, కార్మికుల డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక నోటీసులు జారీ చేస్తూ మంగళవారం ఏలూరులో చలో కలెక్టరేట్ మహాధర్నా, ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ రైతులకు మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తీసుకురావాలని, నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలుచేయాలని తదితర డిమాండ్ల సాధనకు దేశంలో 500 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నామన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కే బాషా, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment