ప్రజాసంక్షేమం, దేశ భవిష్యత్తుకు కృషిచేయడం రాజనీతిజ్ఞత. స్వలాభం, ఎన్నికల్లో గెలుపు, తరతరాల సంపాదన కోసం గడ్డితినడం రాజ కీయం. స్వార్థానికి మనుషులను శవా లుగా మార్చడం కార్పొరేట్ల లక్షణం. అమెరికాలో బహుళజాతి, ఆయుధ సంస్థల పక్షపాతులే అధికారంలో ఉంటారు. ఏ పార్టీ కుర్చీనెక్కినా ఈ సంస్థల ప్రయోజనాలే వాటి లక్ష్యం.
నెహ్రూకు నాటి స్వదేశీ సంస్థలు సహకరించలేదు. పరిశ్రమలను ప్రభుత్వమే స్థాపించి నిర్వహించమన్నాయి. పరిశ్రమలకు నీరు, విద్యుత్తు, రోడ్లు, అనువైన భూమి వంటి మౌలిక వసతుల లేమి వాటి ఆలోచనకు కారణం. ప్రభుత్వం వీటిని కల్పించాక మిశ్రమ ఆర్థిక వ్యవ స్థలో ప్రవేశించాయి. లాభాలివ్వని విద్య, వైద్యం, గ్రం«థాలయ, సాహిత్య, సాంస్కృతిక సంస్థలను ప్రభుత్వమే స్థాపించింది. ఇందిరా గాంధీ ఆధిక్యత కోల్పోయిన నేపథ్యంలో... వామపక్షాల ప్రోద్బలంతో బ్యాంకుల జాతీయీ కరణ, రాజభరణాల రద్దు చేశారు.
వాజ పేయి వర్గం వీటిని విరోధించింది. న్యాయస్థానంలో సవాలు చేసింది. చట్టంతో ఇందిర వీటిని అమలు చేశారు. తర్వాత ప్రభుత్వం, కార్పొరేట్లు సహకరించు కున్నాయి. తమకు అనుకూలంగా ఉండమని ప్రభుత్వాలను, ప్రజా ప్రతినిధులను కార్పొరేట్లు ప్రలోభ పెట్టేవి. తర్వాత తమ తాబేదారులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయేట్లు చేసేవి. క్రమేపీ తామే శాసన నిర్మాతలై అనుకూల చట్టాలు చేయించి, లాభాలను పెంచుకునేవారు. కాంగ్రెస్ క్రమేపీ తగ్గింది. మిశ్రమ ప్రభుత్వాలు వచ్చాయి. పాలక, ప్రతిపక్షాలను తృప్తి పరచడానికి కార్పొరేట్ల ఖర్చు పెరిగింది. వాజపేయి సర్కారు కొంత ఫలితాలనిచ్చింది. కానీ అప్పటి అవినీతి యూపీఏ హయాంలో పెరిగింది.
గుజరాత్‌లో కార్పొరేట్లకు అపరిమిత లాభాలు కట్టబెట్టిన మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థి కావడంలో కార్పొరేట్లు నెగ్గారు. బదులుగా అనేక రూపాల్లో మోదీ సాయం కార్పొరేట్లకు కొనసాగుతోంది. 2024 ఎన్నికల ఫలితాలు మోదీకి హెచ్చరికన్న భావన భ్రమే. మోదీ ఏ ప్రభుత్వాన్ని నడిపినా కార్పొరేట్లకు సహకారం, పరస్పర ప్రయోజన సూత్ర పాలన కొనసాగుతాయి. బీజేపీ మిత్ర పక్షాల భావజాలం మోదీయా నికి భిన్నం కాదు. వారికీ కార్పొరేట్ల ప్రయోజనాల్లోనే లాభా లున్నాయి. అందుకే మోదీ ఆశ్రిత పక్షపాతాలు వారికీ అను కూలమే, అవసరమే, ఆమోదమే.
ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాల్లో గెలుపోటములపై విభిన్న విశ్లేషణలు జరిగాయి. ఆంధ్ర ఫలితాల కారణం వేరు. గత రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దలాలీలకు, కార్పొరే ట్లకు, వారి ప్రతినిధులకు మేళ్ళు లేవు. ప్రజలకు ప్రయోజ నాలు సమయానికి ఇళ్ళకే చేరేవి. పాత పాలక పార్టీపై కార్పొ రేట్లకు కోపమొచ్చింది. విచిత్ర ప్రచారాలతో ఓటర్ల సమీక రణకు, ప్రజాభిప్రాయ నిర్మాణానికి కసితో పనిచేశాయి. గెలుపు మీద నమ్మకం లేక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు మతో న్మాద పార్టీతో కూటమి కట్టాయి. కార్పొ రేట్ల అండ లేని పార్టీ కంటే కార్పొరేట్ల కేంద్ర పాలక పార్టీ పొత్తే ప్రయోజ నమని కార్పొరేట్ల ప్రతినిధులు ప్రచారం చేశారు.
కొత్త పాలకులు కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న చారిత్రీకులు. ముఖ్యమంత్రిగా కాక ముఖ్య కార్యనిర్వాహకాధికారిగా వ్యవహరించిన వారు. అమరావతిలో 50 లక్షల జనాభా కూడుతుందని దానికి 52 వేల ఎకరాల సారవంతమైన నీటి వసతి గల వ్యవసాయ భూమిని సేకరించారు. సామాన్యుడు రాజధా నిలో ఇంటి స్థలం కొనలేడు, ఇళ్ళు కట్టలేడు, అద్దెకుండలేడు. కార్పొరేట్లు తమ మిత్రత్రయాన్ని గెలిపించాయి. ఈ త్రయం మోదీయానికి బేషరతు మద్దతిచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలోని కేంద్ర పథకం పోలవరాన్ని, నిర్వాసితుల పునరా వాసంతో సహా పూర్తిచేయాలనీ, వారే వాగ్దానమిచ్చిన రాజ ధానిని నిర్మించమనీ, పదేళ్ళ ప్రత్యేక హోదా ఇమ్మనీ మోదీ గ్యారంటీని మాత్రం అడగలేదు!
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి, వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, 94902 04545
Comments
Please login to add a commentAdd a comment