ఈనెల 14న బస్టాండ్ నుంచి అరండల్‌పేటకు ఆటో బాడుగకు వెళ్లాను. తిరుగు ప్రయాణంలో గుంటూరు రైల్వేస్టేషన్ ఏడో నంబర్ ప్లాట్‌ఫాంపై నిద్రకు ఉపక్రమించాను. ఈ క్రమంలో జీఆర్పీ కానిస్టేబుల్ వచ్చి లాఠీతో కొట్టగా, ఎడమ చేతికి గాయమైంది. చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు వెళ్లగా చేయి విరిగిందని చెప్పి, చికిత్స అందించారు. సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని జీఆర్పీ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. అప్పటి వరకు ఆటో నడిపే పరిస్థితి లేదు. న్యాయం చేయగలరు.
– ఆటోడ్రైవర్, సుబ్రమణ్యంఆచారి, రెడ్డిపాలెం
Comments
Please login to add a commentAdd a comment