తెలంగాణ అకడమిక్ కన్సల్టెంటుగా రమేష్‌బాబు నియామకం
తెనాలి: హైదరాబాద్ కేంద్రంగా దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలపై పనిచేస్తున్న ఏకై క మానవ రక్షణ అధ్యయన సంస్థ (సీహెచ్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కన్నెగంటి రమేష్‌బాబు తెలంగాణలో మరో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అకడమిక్ కన్సల్టెంటుగా నియమితులయ్యారు. ఈ ప్రకారం ఉత్తర్వులు అందుకున్నట్టు సోమవారం తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్య్ర ఉద్యమనేత కన్నెగంటి హనుమంతు మునిమనవడైన రమేష్‌బాబు తెనాలికి చెందినవారని తెలిసిందే. పన్నెండేళ్లుగా హైదరాబాద్‌లో సీహెచ్‌ఎస్‌ఎస్ సంస్థను నిర్వహిస్తూ ఉగ్రవాదం, తీవ్రవాదం, పేదరికం, నిరక్షరాస్యత, మానవ భద్రత అంశాలపై వివిధ ప్రభుత్వాలు, అసోసియేషన్లతో కలిసి పనిచేస్తున్నారు. గత నెలలో అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కృత్రిమ మేధపై జరిగిన అంతర్జాతీయ సదస్సుకూ హాజరై వచ్చారు. మానవ భద్రత అంశాన్ని పాఠ్యాంశం చేయాలనేది తన భావనగా చెబుతుండే రమేష్‌బాబు, తాజా బాధ్యతల్లో ఏం చేస్తారనేది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment