రాజ్యాంగం కల్పించిన హక్కులతో మహిళల్లో చైతన్యం
జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక
గుంటూరు ఎడ్యుకేషన్ భారతదేశ రాజ్యాంగం కల్పించిన హక్కులతో మహిళలు చైతన్యవంతులై అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్‌లో సోమవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు జిల్లాస్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించారు. డీఈవో రేణుక మాట్లాడుతూ భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. విద్యార్థులు, యువతరం రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు, స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం భారత రాజ్యాంగం పట్ల ఉన్నత భావన కలిగి ఉన్నాయని అన్నారు. ఈసందర్భంగా విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గుంటూరు డీవైఈవో పి.వెంకటేశ్వరరావు, డీసీఈబీ కార్యదర్శి ఏ.తిరుమలేష్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, ఎంఈవోలు జ్యోతికిరణ్, నాగేంద్రమ్మ, అబ్దుల్ ఖుద్దూస్, పలువురు హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ లాన్ టెన్నిస్‌లో ఏపీకి ద్వితీయ స్థానం
కొరిటెపాడు(గుంటూరు): ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ లాన్ టెన్నిస్‌లో టోర్నమెంట్ ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిందని డీఈ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ తరఫున సూపరింటెండెంట్ ఇంజినీర్ కేవీఎల్‌ఎన్ మూర్తి, తెనాలి లైన్‌మేన్ మహేష్‌లు ఆడి ఓపెన్ డబుల్స్ ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరూ కలసి పట్టుదల, నిబద్ధతతో ఈ టోర్నమెంటులో ఆడి ప్రతి పాయింట్‌లోనూ ముందంజలో నిలిచారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకు వచ్చిన మూర్తి, మహేష్‌లకు విద్యుత్‌శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలిపినట్లు వివరించారు.
పీఎఫ్ సౌకర్యం
కల్పించండి
గుంటూరు వెస్ట్ : సుమారు 30 సంవత్సరాలు నిస్వార్థ సేవ చేసినందుకు తమకు న్యాయం చేయాలని వీఆర్వో (గ్రామ పునర్ నిర్మాణ సంస్థ) ఉద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. వీఆర్వో సంస్థ గ్రామాభివృద్ధితోపాటు విద్యా వికాసానికి కృషి చేశామని చెప్పారు. జిల్లాలో సుమారు 1500 మంది ఉన్నారని వారందరికీ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలని సంస్థ సభ్యుడు టి.మహతి తదితరులు విజ్జప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment