వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం

Published Thu, Jan 30 2025 1:59 AM | Last Updated on Thu, Jan 30 2025 1:59 AM

వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం

వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నరసరావుపేట ఈస్ట్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యను వ్యాపారీకరణ చేసేందుకు సిద్ధపడుతున్నదని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ విమర్శించారు. అరండల్‌పేటలోని సీసీపీఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమాఖ్య జిల్లా సమితి సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. విద్యారంగంలో అత్యున్నతమైన వైద్యవిద్యను పేద విద్యార్థుల నుంచి దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. దానిలో భాగంగానే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 12 మెడికల్‌ కళాశాలలను తాము నిర్వహించలేమంటూ జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయటం కన్నా దౌర్భాగ్యం మరోకటి లేదన్నారు. ఆయా కళాశాలలను 2025–26 విద్యాసంవత్సరంలో పూర్తి చేసి ప్రభుత్వమే నడపాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి రాకముందు వైద్య విద్యార్థులకు శాపంగా మారిన 107, 108 జీఓలకు రద్దు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన నారా లోకేష్‌.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సదరు జీఓల ఊసే తీసుకురావటం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా రాష్ట్రంలో వందలాది మెడికల్‌ సీట్లు కోల్పోయే పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రైవేటు మెడికల్‌ కళాశాలలకు వత్తాసు పలుకుతున్నట్లుగా ఉందని ఇప్పటికే విద్యార్థులకు, తల్లిదండ్రులకు అర్థమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థుల ఉన్నత విద్య ఆశలు అడియాశలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వమే ప్రారంభిస్తే దాదాపు 1,700 సీట్లు రాష్ట్ర విద్యార్థులకు దక్కే అవకాశం ఉంటుందని వివరించారు. కానీ, ప్రభుత్వం తన ఎన్నికల హామీని విస్మరించి అధికారంలోకి వచ్చిన తరువాత మెడికల్‌ కళాశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు, గుడిపల్లి జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement