డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు షురూ | Sakshi
Sakshi News home page

డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు షురూ

Published Tue, May 7 2024 6:15 AM

డిగ్ర

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, అదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ రెండో, ఆరో సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కేయూ రిజిస్ట్రార్‌ పి.మల్లారెడ్డి సందర్శించారు. ఆయన వెంట ఎస్‌.నర్సింహాచారి, డాక్టర్‌ తిరుమలాదేవి ఉన్నారు.

ఏడుగురు విద్యార్థుల డీబార్‌

కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఫార్మసీ రెండో సెమిస్టర్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ చేస్తూ ఏడుగురు విద్యార్థులు పట్టుబడగా డీబార్‌ చేశామని పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి తెలిపారు.

ఫార్మసిస్ట్‌లకు త్వరలోనే

మంచి వేతనాలు

ఎంజీఎం: ఫార్మసిస్టులకు త్వరలోనే మంచి వేతనాలు అందుతాయని తెలంగాణ గవర్నమెంట్‌ ఫార్మసిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్‌ అన్నారు. సోమవారం సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కందకట్ల శరత్‌బాబు అధ్యక్షతన డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగిన హనుమకొండ, వరంగల్‌ జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 35 ఏళ్లుగా పీఆర్‌సీలలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌లకు అన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్హతలు, విధులను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని పీఆర్‌సీ కమిటీకి విన్నవించామని, దీనిపై వారు సానుకూలంగా స్పందించారని తెలి పారు. అనంతరం సుదర్శన్‌గౌడ్‌ను సన్మానించారు. సమావేశంలో సంఘం వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు దేవంభట్ల ప్రకాశ్‌రావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అవినాష్‌, నాయకులు నార్ల వేణు, సూరయ్య, విజయలక్ష్మి, జాన్సీలక్ష్మి, శ్రీదేవి, సునీత తదితరులు పాల్గొన్నారు.

రుద్రేశ్వరాలయంలో

మాస శివరాత్రి పూజలు

హన్మకొండ కల్చరల్‌: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో చైత్రమాస బహుళ త్రయోదశి సోమవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో.. వేదపండితులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రేశ్వరస్వామివారిని అర్ధనారీశ్వరుడిగా అలంకరించి పూజలు జరిపారు. అనంతరం నాట్య మండపంలో రుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివార్లకు కల్యాణం జరిపించారు. నూతనంగా నియమితులైన హనుమకొండ జిల్లా కోర్టు జడ్జి సీహెచ్‌ రమేశ్‌బాబు కల్యాణోత్సంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

పీఎం సెక్యూరిటీ ట్రయల్‌రన్‌

ఖిలా వరంగల్‌ : పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు(బుధవారం) లక్ష్మిపురం మైదానంలో నిర్వహించే సభకు ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి భద్రతాధికారులు(సెక్యూరిటీ) సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి మామునూరు విమానాశ్రయానికి వచ్చారు. హెలిపాడ్‌నుంచే విమానాశ్ర యం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెలికాప్టర్‌ ద్వారా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రాత్రి కోటను సందర్శించారు. ఎస్‌పీజీ అధికారులు, ఈస్ట్‌జోన్‌ డీసీపీ రవీందర్‌, ఏసీపీ తిరుపతి, ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

నానీల కమ్మలు పుస్తకావిష్కరణ

హన్మకొండ: ఉపాధ్యాయుడు, రచయిత మడ త భాస్కర్‌ రచించిన నానీల కమ్మలు పుస్తకా న్ని సోమవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పల్లా రవీందర్‌ రెడ్డి భవన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎం.రఘు, సినిగేయ రచయిత, ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి ఆవిష్కరించారు. అవుసుల భాను ప్రకాశ్‌ పుస్తక సమీక్ష చేశారు. పుస్తకాన్ని కక్కెర్ల దయాకర్‌కు అంకితమిచ్చారు. కార్యక్రమంలో పుస్తక ప్రచురణ కర్త నేతల స్వామి, కవులు, రచయితలు చక్రవర్తుల శ్రీనివాస్‌, డాక్టర్‌ చింతం ప్రవీణ్‌, కక్కెర్ల దయాకర్‌, పతంగి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు షురూ
1/2

డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు షురూ

డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు షురూ
2/2

డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు షురూ

Advertisement
 
Advertisement
 
Advertisement