పర్యాటక కేంద్రంగా ఆభివృద్ధి | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రంగా ఆభివృద్ధి

Published Tue, May 7 2024 6:20 AM

పర్యాటక కేంద్రంగా ఆభివృద్ధి

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

ఖిలా వరంగల్‌ : వీరనారి రాణిరుద్రమదేవి నడియాడిన నేలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖిలా వరంగల్‌ పడమరకోట జంక్షన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కడియం కావ్య గెలు పే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, నవీన్‌రాజు, శ్రీనివాస్‌, శ్యాం, కార్పొరేటర్‌ ఉమ, ప్రకాశ్‌ పాల్గొన్నారు.

ఉర్సు దర్గాలో పూజలు

వరంగల్‌ ఉర్సు కరీమాబాద్‌లోని హజ్రత్‌ మాషూక్‌ రబ్బానీ రహమతుల్లా దర్గాను మంత్రి కొండా సురేఖ, పార్లమెంట్‌ అభ్యర్థి కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావులు సోమవారం దర్శించుకున్నారు. పీఠాధిపతి హజ్రత్‌షా ఉబేద్‌బాబాతో కలిసి వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నేత ఎండీ.అమ్జద్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంఏ.జబ్బార్‌, షకిల్‌ హైమద్‌ (గోరిమి యా), కొత్తపెల్లి శ్రీనివాస్‌, బాసాని శ్రీనివాస్‌, చాంద్‌పాషా, శ్రీరామ్‌ రాజేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement