‘ఎల్‌ఆర్‌ఎస్’ పరిశీలనలో నిర్లక్ష్యం తగదు
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం తగదని బల్దియా మేయర్ గుండు సుధారాణి అధికారులను హెచ్చరించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన, పురోగతిపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న నగరవాసులు ముందుకు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. బల్దియా అధికారులకు సహకరించి వారు కోరిన ధ్రువపత్రాలను అందించి క్రమబద్ధీకరణ జరిగేలా సహకరించాలన్నారు. ఇప్పటివరకు 7 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినట్లు సిటీ ప్లానర్ తెలిజేయగా.. వేగం పెంచాలని మేయర్ ఆదేశించారు.
వేగంగా నమోదు చేయండి: కమిషనర్
నగర వ్యాప్తంగా ఉన్న అసెస్‌మెంట్లను వేగంగా భువన్ యాప్‌లో నమోదు చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం హనుమకొండలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ భువన్ యాప్ ట్రేడ్ వసూళ్ల పురోగతిపై ఉన్నతాధికారులతో కమిషనర్ సమీక్షించి వేగంగా పూర్తి చేసేందుకు సూచనలిచ్చారు. వేర్వేరుగా జరిగిన ఆయా సమావేశాల్లో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్‌ఓ రాజేశ్, టీఓ బిర్రు శ్రీనివాస్, ఈఈలు మహేందర్, సంతోశ్‌బాబు, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీపీఎస్ ఏర్షాద్, టీపీబీఓఓలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment