విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
న్యూశాయంపేట: విద్యను అందిపుచ్చుకుని ఉన్నత శిఖిరాలు అధిరోహించాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్.రమేశ్‌బాబు అన్నారు. గురువారం హనుమకొండ హంటర్‌రోడ్, హనుమకొండ–1, మైనార్టీ (బాలికలు) గురుకులంలో ప్రిన్సిపాల్ ఎం.నీరజ అధ్యక్షతన బాలల దినోత్సవం సందర్భంగా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో బాలల హక్కులపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలకార్మికులను ఎవరూ ప్రోత్సహించవద్దన్నారు. ఈసందర్భంగా గురుకులంలో ఇంటర్ చదువుతూ.. కరాటే పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థి ఆసియాకు జ్ఞాపిక అందించి అభినందించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. బాలికలు లైంగిక వేధింపులు, ఇతర సమస్యలను తెలిపేందుకు గురుకులంలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేస్తున్నట్టు జడ్జి రమేశ్‌బాబు తెలిపారు. బాలికలు కంప్యూటర్ విద్యను అందిపుచ్చుకునేందుకు 10 కంప్యూటర్లు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, పీపీ శ్రీకాంత్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment