ఎంజీఎంలో దళారులు
ఎంజీఎం: మంత్రులు వచ్చి పరిశీలించి దిశానిర్దేశం చేసినా.. కలెక్టర్ వరుస తనిఖీలు చేసినా.. వైద్య శాఖ ఉన్నతాధికారులు చివాట్లు పెట్టినా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పాలన గాడిన పడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చిన రోగికి సకాలంలో వైద్యమందించి జీవం పోస్తామనే నమ్మకాన్ని కల్పించడంలో పరిపాలనాధికారులు పూర్తిగా విఫలమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అఽధికారుల పర్యవేక్షణాలోపంతో ఆస్పత్రి అత్యవసర విభాగ సేవలు అధ్వానంగా తయారు కావడం ఒక ఎత్తు అయితే.. ఆస్పత్రిలో సేవల లోపాలను ఎత్తి చూపుతూ రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలా రెఫరల్ వైద్యం నడుస్తు న్న క్రమంలో ఇటీవల ఏకంగా ఓ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ వార్డుకు వచ్చి శాంపిళ్లు తీసుకెళ్లడాన్ని బట్టి గమనిస్తే ఆస్పత్రి పరిపాలనాధికారుల పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
డయాగ్నోస్టిక్స్‌లపై నిఘా కరువు..
ఎంజీఎం చుట్టూ ఉన్న డయాగ్నోస్టిక్ కేంద్రాలపై వైద్యారోగ్యశాఖ అధికారుల నిఘా పూర్తిగా కరువైంది. ఆస్పత్రికి వచ్చే పేద రోగులే లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్న మూడు, నాలుగు డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఆస్పత్రిలో వారి ఏజెంట్లను పెట్టుకుని సిబ్బందితో చేతులు కలిపి ఇక్కడి శాంపిల్స్‌ను ప్రైవేట్‌కు తరలిస్తున్నారు. ఈ తతంగం గత కొన్ని నెలలుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధికారులు ఇలాంటి కేంద్రాలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పేద రోగులు వేడుకుంటున్నారు.
అధికారుల పర్యటనలతోనూ మారని తీరు..
‘ఎంజీఎం ఆస్పత్రిలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు పర్యటించినా లాభం లేదు. మాకు రక్త పరీక్షలు బయటికి రాస్తున్నారు.. వందల నుంచి వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి’ అని రోగులు లబోదిబోమనడం పరిపాటిగా మారింది. పదుల సంఖ్యలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు సైతం సరిపోరంటూ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ల్యాబ్‌టెక్నీషియన్లను నియమించుకుంటున్నారు. దీనికితోడు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రక్త పరీక్షలకు సంబంధించిన కెమికల్స్ సరఫరా చేస్తున్నా.. రక్త పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు ఎందుకు పంపిస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి చుట్టూ నెలకొల్పిన కొన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యసిబ్బందితో మిలాఖత్ అయి రోగులకు మాయమాటలు చెప్పి రక్తపరీక్షల శాంపిళ్లను పంపిస్తున్నార న్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆస్పత్రిలో గాడి తప్పిన పాలన
ప్రాంగణంలో ప్రైవేట్ ఆస్పత్రుల ఏజెంట్లు
ఏకంగా వార్డులనుంచే శాంపిళ్లు
సేకరిస్తున్న ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు
పర్యవేక్షణలో అధికారులు విఫలం..
Comments
Please login to add a commentAdd a comment