నేటి గ్రేటర్ గ్రీవెన్స్ రద్దు
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం(నేడు) నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా పరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న ఆమె.. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి గ్రీవెన్స్ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
వరంగల్, హనుమకొండ
ప్రజావాణి కూడా..
వరంగల్/హనుమకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లలో నేడు(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలను పరిపాలనా పరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈవిషయాన్ని జిల్లా ప్రజలు గమనించి ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు.
ఆర్చ్ నిర్మాణానికి
రూ.1.5 లక్షల విరాళం
ఐనవోలు: మల్లికార్జునస్వామి దేవస్థానం వారు చేపట్టనున్న ఆర్చ్ నిర్మాణానికి మల్లికార్జునస్వామి భక్తులు రూ.1.5 లక్షల చెక్కును మల్లన్న ఆలయంలో ఆదివారం అందజేశారు. కొట్టం రాజు, కొట్టం మోహన్, పెండ్లి ప్రశాంత్, పెండ్లి ప్రవీణ్, పెండ్లి నవీన్, పెండ్లి తిరుపతి, కడుదూరి సంతోశ్, పెంతల అశోక్, ఆకుతోట రాజు మల్లికార్జునస్వామి టీంగా ఏర్పడి వ్యాపారం నిర్వహించారు. తాము అనుకున్నట్లుగా వ్యాపారం సాగితే మల్లన్న ఆలయానికి రూ.1.5 లక్షలు విరాళం అందజేస్తామని గతంలో మొక్కుకున్నారు. ఈక్రమంలో ఆదివారం మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రూ.1.5 లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు. కాగా.. ఎండోమెంట్ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
ప్రశ్నించే గొంతుక నర్సిరెడ్డి
విద్యారణ్యపురి: ప్రశ్నించే గొంతుక అలుగుబెల్లి నర్సిరెడ్డి.. శాసనమండలి వేదికగా ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో కృషిచేశారని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు బద్దం వెంకటరెడ్డి అన్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విద్యారంగంపై ప్రస్తావించిన అంశాలు, ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలు, పరిష్కారాలు తదితర అంశాలతో కూడిన పుస్తకాన్ని వెంకటరెడ్డి ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐ దున్నరేళ్లుగా టీచర్ ఎమ్మెల్సీగా వివిధ సమస్యల పరిష్కారానికి కృషిచేసిన నర్సిరెడ్డిని మ రోసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించా లని కోరారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎ ఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్‌రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ పెండెం రాజు, ఉపాధ్యక్షుడు ఆజ్మీరా రాజారాం, కార్యదర్శులు లింగారావు, కె.సదానందం, మెరుగు ప్రసన్నానంద్ తదితరులు పాల్గొన్నారు.
నిట్‌తో అగస్థ్య
హైడ్రోజన్ ఎంఓయూ..
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో హైదరాబాద్ అగస్థ్య హైడ్రోజన్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు ఆదివారం నిట్‌లో నిర్వహించిన 18వ నేషనల్ ఫ్రంటీయర్ ఆఫ్ ఇంజ నీరింగ్ సదస్సులో అవగాహన కుదిరింది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, అగస్ధ్య హైడ్రోజెన్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శశిరెడ్డి ఎంఓ యూను పరస్పరం అందజేసుకున్నారు.
డాక్టర్ రామా చంద్రమౌళికి
జీవన సాఫల్య పురస్కారం
హన్మకొండ కల్చరల్: వరంగల్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ రా మా చంద్రమౌళి జీవన సా ఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈమేరకు ఈనె ల 22, 24 తేదీల్లో ఖతర్ దేశంలోని దోహాలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తొమ్మిదో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని రామా చంద్రమౌళికి పురస్కారాన్ని అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment