బీఆర్‌ఎస్ నేతలకు పిచ్చిపట్టింది..
హన్మకొండ చౌరస్తా: బీఆర్‌ఎస్ నేతలకు పిచ్చిపట్టింది.. వారు తక్షణమే సైకియాట్రిస్ట్‌కు చూపించుకోవడం మంచిదని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన హైదరాబాద్‌ను అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టిన మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగుల పడి పోతారు.. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేటీఆర్ పనేనని అన్నారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని లక్షమంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రులు పరిశీలించి సభాస్థలి వద్ద వారు మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన అధికారులను విదేషాల్లో దాచారని, కేటీఆర్ విషయంలో నిజాలు తేల్చిన తర్వాతనే చర్యలుంటాయని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలకు రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదని, అందుకే అధికారులపై దాడులు చేస్తూ.. తాము చేస్తున్న మంచి పనులు, హైడ్రాకు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ చేసిన సకల జనుల సర్వే ఏమైందని ప్రశ్నించిన మంత్రులు.. లిమ్కా బుక్ రికార్డు కోసమే నాడు ఆ ప్రభుత్వం సర్వే చేసిందని ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందించడానికే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్న బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు తిడుతున్నారు.. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ను తెలంగాణ రెండో రాజధాని చేయడానికి అడుగులు పడుతున్నాయి.. ఇక్కడ రాహుల్‌గాంధీ సభ సక్సెస్ అయింది.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రుల వెంట హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు ఉన్నారు.
మంత్రులు కొండా సురేఖ, సీతక్క
ఆర్ట్స్ కాలేజీ సభా స్థలి పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment