‘కామన్ విద్య’ అమలు చేయాలి
● టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్
కాళోజీ సెంటర్: రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆది వారం జరిగిన వరంగల్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని, ప్రాథమిక పాఠశాలలకు హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేయాలన్నారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయాలన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా యూ.అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఈదుల వీరస్వామి, ఉపాధ్యక్షులుగా స్వామి, డి.మల్లయ్య, ముజాహిద్ అలీ, కార్యదర్శులుగా బెల్లంకొండ పూర్ణ చందర్, పి.సురేశ్, మనుపాటి వెంకట్, బి.ప్రసాద్, ఆడిట్ కమిటీ కన్వీనర్లుగా కె.బుచ్చాచా రి, రాజన్న, జీఓ కమిటీ బాధ్యులుగా బి.జగన్‌మోహన్, పి.మల్లికార్జున్, అకడమిక్ సెల్ బాధ్యులుగా ఎంఏకే.తన్వీర్, కె.ఉమేశ్ ఎంపికైనట్లు ఎన్నికల పరిశీలకులు ఎస్.కవిత, కడారి భోగేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో బాధ్యులు జి.వెంకటేశ్వర్లు, మనోహర్, వి.విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment