పోక్సో కేసులో నేరస్తుడికి 20 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో నేరస్తుడికి 20 ఏళ్ల జైలు

Published Thu, Jan 30 2025 1:22 AM | Last Updated on Thu, Jan 30 2025 1:22 AM

-

వరంగల్‌ లీగల్‌: బాలికను బెదిరించి లైంగికంగా వాడుకున్న నేరం రుజువుకావడంతో నేరస్తుడు గీసుకొండ మండలం కీర్తినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ ఎండీ అజీముద్దీన్‌కు 20ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ బుధవారం వరంగల్‌ పోక్సో కోర్టు జడ్జి మనీషా శ్రావణ్‌ ఉన్నమ్‌ తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. జాన్‌పాక్‌ గ్రామానికి చెందిన ఒంటరి మహిళ తన కుమారు డు, కూతురుతో అద్దె ఇంట్లో ఉంటూ అదే ఇంట్లో ముందుబాగాన హోటల్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఈక్రమంలో పాఠశాలకు సెలవులు ఉండటంతో 11 సంవత్సరాల తన కూతురును వెనక రూంలో ఉండి చదువుకోమని చెప్పింది. కీర్తినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ ఎండీ అజీముద్దీన్‌ 2021 జనవరి 12న మధ్యాహ్నం బాలిక ఉన్న గదిలోకి వెళ్లాడు. అదేసమయంలో ఆగదిలోకి వెళ్లిన బాలిక తల్లిని చూసిన నిందితుడు పారిపోయాడు. దీంతో ‘చెప్పినట్లు వినకపోతే తనతోపాటు అన్నయ్యను చంపుతానని బెదిరించి’ లోబర్చుకున్నాడని బాలిక తన తల్లికి వివరించింది. ఇప్పటికే పలు మార్లు తనను శారీరకంగా వాడుకున్నట్లు తెలియ జేసింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అజీముద్దీన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చా రు. విచారణలో నేరం రుజువుకావడంతో అజీముద్దీన్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. బాధితుల పరిహార చెల్లింపు పథకం కింద మైనర్‌ బాలికకు రూ.3 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కేసును పోలీస్‌ అధికారులు నరేష్‌కుమార్‌, బి.రాజు, ఎ.మహేందర్‌ పరిశోధించగా లైజన్‌ ఆఫీసర్‌ హరికృష్ణ, భరోసా లీగల్‌ అడ్వైజర్‌ నీరజ పర్యవేక్షణలో కానిస్టేబుల్‌ బొల్లం యుగేందర్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్‌ పక్షాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మర్రి వాసుదేవరెడ్డి కేసును వాదించారు.

తీర్పు వెల్లడించిన

జడ్జి మనీషా శ్రావణ్‌ ఉన్నమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement