అభివృద్ధికి మార్గనిర్దేశం ‘బాలవికాస’
కాజీపేట రూరల్: సమాజంలో మహిళల అభివృద్ధికి మార్గనిర్దేశంగా నిలుస్తున్న బాలవికాస సేవలు ఆదర్శనీయమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస ప్రాంగణంలో బుధవారం సుస్థిర వ్యాపార మహిళా వికాసం నినాదంతో రాష్ట్ర స్థాయి మహిళా మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కావ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్న బాలవికాసకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు ఎక్కడ ఉండే అక్కడ సంతోషముంటుందని అన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత సాధిస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వపరంగా మహిళలను అభివృద్ధిచేయాలనే ఉద్ధేశంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. బాలవికాస వ్యవస్థాపకురాలు బాలతెరిసా జింగ్రాస్ కెనడా నుంచి ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ బాలవికాస గొప్ప లక్ష్యంతో మహిళా సాధికారత కార్యక్రమాన్ని 32 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి మాట్లాడతూ ప్రతి మహిళలను లక్షాధికారిని చేయడమే బాలవికాస ధ్యేయమని అన్నారు. బాలవికాస ఆధ్వర్యంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక వ్యాపార శిక్షణకు హైదరాబాద్‌లో 20 ఎకరాల్లో సామాజిక వ్యాపార కేంద్రాన్ని నిర్మించామని అన్నారు. వ్యాపార రంగాల్లో రాణించిన నలుగురు మహిళలకు బాలవికాస మహిళా ఔత్సాహిక వ్యాపార సాఫల్య పురస్కారం–2024 బహుమతులు ప్రదానం చేశారు. అడిషనల్ డీఆర్‌డీఏ సుధీర్ మాట్లాడుతూ.. మహిళా వికాసానికి బాలవికాస చేస్తున్న కృషిని అభినందించారు. బాలవికాస మహిళా అభివృద్ధి పథక మేనేజర్ లత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీపీఎం అనిల్, డీఎంఎం రజిత, జనవికాస అధ్యక్షుడు లూర్ధుమర్రెడ్డి, బోర్డు మెంబర్ డాక్టర్ హరీశ్, డైరెక్టర్లు రాహుల్, సునితారెడ్డి, మేనేజర్లు ప్రతాప్‌రెడ్డి, ప్రాన్సీస్ రెడ్డి, తిరుపతి, మంజుల, శోభ, శివరాం, మధుసూదరెడ్డి, మోసెస్, విజేందర్ పాల్గొన్నారు.
ఎంపీ కావ్య, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
కాజీపేటలో బాలవికాస రాష్ట్ర మహిళా మహాసభ
Comments
Please login to add a commentAdd a comment