అనువైన స్థలాలు గుర్తించండి
వరంగల్: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎస్టీపీల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, సత్యశారద అన్నారు. గురువారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో బల్దియా ఆధ్వర్యంలో ‘అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ మురుగు నీటి ని ర్వహణ వ్యవస్థ, ఎస్‌టీపీల ఏర్పాటుకు స్థలాల గ ుర్తింపు’పై అధికారులు, కన్సల్టెన్సీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పైఎన్‌కే బిల్డ్ కాన్ ప్రైవే ట్ లిమిటెడ్ కన్సల్టెంట్ ప్రతినిధులచే ఏర్పాటు చేసి న పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కలెక్టర్లతో పా టు కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఇరు జిల్లాల అధికారులతో సమీక్షించారు. వరంగల్ మహా నగరంగా పాలక సంస్థ పరిధి 2055 వరకు సుమారు 21.31 లక్షల జనాభాకు అవసరమయ్యే ప్రణాళికలు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాథమిక సర్వే నిర్వహించినట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 9 జోన్లను ఏర్పాటు చేసి, ప్రతీ జోన్‌లో సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆయా ప్రాంతాల్లో అవసరమైన స్థలం గురించి కన్సల్టెన్సీ ప్రతినిధులు వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ.. సర్వేలో ఎస్టీపీల కోరకు స్థలాల ఫిజిబిలిటీని సంబంధిత రెవెన్యూ అధికారులు బృందాలను ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో ఆయా స్థలాలను పరిశీలించి త్వరితంగా ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, రాథోడ్ రమేశ్, ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, బల్దియా ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇరిగేషన్ అధికారి సీతారాం పాల్గొన్నారు.
హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు
Comments
Please login to add a commentAdd a comment