నిలిచిన ఎయిడెడ్ టీచర్ల వేతనాలు
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఎ యిడెడ్ ఉపాధ్యాయులకు జనవరి వేతనాలు ఇంకా అందలేదు. ఈ మేరకు టీపీటీఎఫ్, ఎయిడెడ్ ఉపాధ్యాయ జేఏసీ బాధ్యులు ఇటీవల కలెక్టర్ డాక్టర్ సత్య శారదను కలిసి డీఈఓపై ఫిర్యాదు చేశారు. ఉ పాధ్యాయులు ప్రతీ సంవత్సరం ఐటీ రిటర్న్‌ను డీడీఓలకు సమర్పిస్తారు. కానీ, ఫిబ్రవరి పూర్తికాకముందే ఎయిడెడ్ పాఠశాలలకు డీడీఓగా ఉన్న డీఈఓ అవసరమైన డాక్యుమెంట్లతో ఐటీ రిటర్న్‌కు రెండు రోజుల్లో సమర్పించాలని జనవరి 28న ప్రొసీడింగ్ జారీ చేశారు. కొంత సమయం కావాలని ఉ పాధ్యాయ సంఘాలు అడిగినా తాను చెప్పినవిధంగా చేయాలని డీఈఓ కరాఖండిగా చెప్పినట్లు తెలి సింది. గత్యంతరం లేక ఉపాధ్యాయులు అప్పులు చేసి ఐటీ రిటర్న్‌కు చలాన్లు కట్టి స్టేట్‌మెంట్ సమర్పించినట్లు సమాచారం. ఉపాధ్యాయుల ఐటీ రిట ర్స్ డాక్యుమెంట్స్‌ను త్రిమెన్ కమిటీ పరిశీలించింది.
డీటీఓకు పంపని వేతనాల బిల్లులు
వేతనాల బిల్లులు తాను తనిఖీ చేసిన తర్వాతనే డీ టీఓకు పంపుతానని డీఈఓ తెగేసి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఉపాధ్యాయులకు తమ సర్వీస్‌లో 6, 12, 18, 24 సంవత్సరాలకు అప్రయత్న పదోన్నతి స్కీం ద్వారా అదనపు ఇంక్రిమెంట్లు మంజురు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. 6 నెలలైనా మంజూరు చే యడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రిటై ర్డ్ ఉపాధ్యాయులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సర్టిఫికెట్ ఇచ్చి బెనిఫిట్స్, పెన్షన్ మంజూరు కోసం డీఈఓ ద్వారా ఏజీ కార్యాలయానికి పంపించాలి. డీఈఓ కార్యాలయంలో పెన్షన్ దరఖాస్తులు సమర్పించినా రిటైర్ట్ ఉపాధ్యాయులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పెన్షన్ ప్రపోజల్స్‌ను ఏజీకి పంపించకపోవడంతో 8 నెలలుగా పెన్షన్ రావడం లేదని రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయక ఆరోగ్య బాలికల పాఠశాల ఉపాధ్యాయులకు ఆగస్టు నుంచి వేతనాలు రావడం లేదు. తీవ్ర జాప్యం చేసి నాలుగు నెలల బిల్లులు డీటీఓకు పంపారు. అవి ఇ–కుబేర్‌లో సప్లిమెంటరీ బిల్లులుగా ఉండి జమకావడం లేదని, ఆమ్యామ్యాలు ముట్టిన తర్వాత కూడా మోక్షం లభించడం లేదని పేర్కొంటున్నారు.
మీకు చెప్పాలనే రూల్ ఉందా:
డీఈఓ జ్ఞానేశ్వర్
డీఈఓ కార్యాలయంలోని పలు విషయాల గురించి డీఈఓ జ్ఞానేశ్వర్‌ను సాక్షి వివరణ అడిగే ప్రయత్నం చేయగా మీకు చెప్పాలనే రూల్ ఉందా అని సమాధానం ఇచ్చారు. ఏదైనా సమాచారం కావాలంటే లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని సీసీకి చెప్పి పంపడం గమనార్హం.
ఐటీ రిటర్న్‌కు అప్పులు చేసి ఇబ్బందులు
డీఈఓపై కలెక్టర్‌కు ఉపాధ్యాయుల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment