బాలల హక్కుల రక్షణలో భాగస్వాములవ్వాలి
● కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ఎన్.రవి
హన్మకొండ: బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ఎన్.రవి అన్నారు. ‘ఆపరేషన్‌న్ స్మైల్, బాలల సంరక్షణ కార్యక్రమాలపై గురువారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్ ద్వారా సాధించిన విజయాలను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకన్న పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా బాలల రక్షణకు కృషి చేసిన పోలీసు, ఇతర శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు ఆడిషనల్ డీసీపీ ఎన్.రవి ప్రశంసా పత్రాలు అందించారు. సమావేశంలో హనుమకొండ జిల్లా సంక్షేమాధికారి జయంతి, వరంగల్ జిల్లా సంక్షేమాధికారి రాజమణి, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ఎర్ర శ్రీకాంత్, హనుమకొండ, వరంగల్ జనగామ జిల్లాల బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్లు అన్నమనేని అనిల్ చందర్‌రావు, కె.వసుద, ఉప్పలయ్య, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లా బాలల సంక్షేమ అధికారులు ప్రవీణ్‌కుమార్, శ్రీదేవి, రవికాంత్, హనుమకొండ బాల రక్ష భవన్ కో–ఆర్డినేటర్ అవంతి, చైల్డ్ లైన్ కో–ఆర్డినేటర్లు కె.భాస్కర్, శ్వేత, రవికుమార్‌తోపాటు 9 డివిజన్ కేంద్రాల నుంచి పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment