‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’ | US Senator Suggests Israel Should Be Allowed To Nuke On Hamas | Sakshi
Sakshi News home page

‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’.. అమెరికా సెనేటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Tue, May 14 2024 10:59 AM | Last Updated on Tue, May 14 2024 12:39 PM

US Senator Suggests Israel Should Be Allowed To Nuke On Hamas

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరగుతున్న యుద్ధాన్ని అమెరికా రిపబ్లిక్‌ పార్టీ సెనేటర్‌ లిండ్సే గ్రాహం రెండో ప్రప్రంచ యుద్ధంతో అభివర్ణించారు. అమెరికా.. జపాన్‌పై బాంబులు వేసి యుద్ధం ముగించటం అప్పట్లో గొప్ప నిర్ణయమని అ‍న్నారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు సైతం అమెరికా బాంబులు ఇస్తే హమాస్‌తో యుద్ధాన్ని ముగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. లిండ్సే గ్రాహం మొదటి నుంచి ఇజ్రాయెల్‌ మద్దతుదారు.

ఇజ్రాయెల్‌కు 3000 భారీ బాంబులు అందజేయటాన్ని నిలిపివేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పెరల్‌ హార్బర్‌కు సంబంధించి అమెరికా జర్మనీ, జపాన్‌లతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో  అమెరికా జపాన్‌లోని హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబుపై విసిరి ఆ యుద్ధాన్ని ముగించింది. 

అది అప్పుడు చాలా  గొప్ప నిర్ణయం. అదే విధంగా ఇజ్రాయెల్‌కు కూడా బాంబులు అందజేస్తే.. హమాస్‌తో యుద్ధం ముగిస్తుంది. ఇజ్రాయెల్‌ ఇంకా నష్టాన్ని భరించే స్థితిలో లేదు. ఇజ్రాయెల్‌ తనను తాను రక్షించుకోవడానికి ఏమైనా చేయవచ్చు’’ అని గ్రహం అన్నారు.

ఇక.. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌పై బాంబు వేయటం సరైన నిర్ణయమే అయితే..  ప్రస్తుతం ఇజ్రాయెల్‌ బాంబులు వేస్తే కూడా సరైన నిర్ణయమే అవుతుందని జోబైడెన్‌ను విమర్శించారు.

ఇక.. రఫాలో యుద్ధం కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్‌ సైన్యానికి ఇటీవల అమెరికా 3000 భారీ బాంబుల అందజేతను నిలిపివేసిన విషయం తెలిసిందే.  అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో గాజాలో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బైడెన్‌ ఇజ్రాయెల్‌కు బాంబులు అందించడాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement