కరీంనగర్ క్రైం: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించి, ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన మొగిలి లక్ష్మయ్యకు ఈ నెల 19న ఓ బ్యాంకు నుంచి మనూష అనే మహిళ పేరిట ఫోన్ వచ్చింది. మొదట లోన్ కావాలా అని అడగగా అతను నిరాకరించాడు. తర్వాత క్రెడిట్ కార్డు ఉంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే రూ.2 లక్షలు లాభం వస్తుందని చెప్పింది. క్రెడిట్ కార్డు వివరాలు తీసుకుంది. తర్వాత మొగిలి క్రెడిట్ కార్డు నుంచి రూ.66,998 కట్ అయ్యాయి. ఎందుకయ్యాయని ఆమెకు ఫోన్ చేస్తే మూడు రోజుల్లో జమ చేస్తామని చెప్పింది. గడువు దాటినా డబ్బులు జమ కాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. సోమవారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
● క్రెడిట్ కార్డు నుంచి రూ.66 వేలు కాజేసిన వైనం
Comments
Please login to add a commentAdd a comment