ఈవీఎంలను జాగ్రత్తగా తరలించాలి | Sakshi
Sakshi News home page

ఈవీఎంలను జాగ్రత్తగా తరలించాలి

Published Sat, Apr 20 2024 1:55 AM

వీవీ ప్యాట్‌లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ - Sakshi

జనగామ రూరల్‌: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్‌లను జాగ్రత్తగా తరలించాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంను సందర్శించారు. ఈవీఎంల తరలింపు ప్రక్రియను సహాయ ఎన్నికల అధికారులు పింకేష్‌కుమార్‌, రోహిత్‌సింగ్‌, ఆర్డీఓలు డి.కొమురయ్య, డీఎస్‌ వెంకన్నలతో కలిసి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం సూచనల మేరకు బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్‌ల వివరాల స్కానింగ్‌ పకడ్బందీగా చేపట్టి ధ్రువీకరించాలని చెప్పారు. కార్యక్రమంలో పార్టీల ప్రతినిధులు చెంచారపు శ్రీనివాస్‌, రావెల రవి, విజయభాస్కర్‌, జోగు ప్రకాష్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూంలకు చేరిన ఈవీఎంలు

పాలకుర్తి/పాలకుర్తి టౌన్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. పాలకుర్తికి సంబంధించి స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంకు, అలాగే స్టేషన్‌ఘన్‌పూర్‌కు సంబంధించి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ని స్ట్రాంగ్‌ రూమ్‌కు శుక్రవారం రాత్రి తరలించారు. వాటిని జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం నుంచి ఆర్టీసీకి చెందిన రెండు డీజీటీ వాహనాల్లో పోలీస్‌ ఎస్కార్ట్‌ మధ్య తీసుకువచ్చి భద్రపరిచారు. పాలకుర్తిలో అదనపు కలెక్టర్‌, ఏఆర్‌ఓ రోహిత్‌సింగ్‌, ఏసీపీ నర్సయ్య, ఘన్‌పూర్‌లో డిప్యూటీ కలెక్టర్‌ సుహాసిని, ఏసీపీ భీమ్‌శర్మ తదితరులు పర్యవేక్షించారు.

కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

Advertisement
Advertisement