చిటుకు రోగం నివారణకు టీకాలు | Sakshi
Sakshi News home page

చిటుకు రోగం నివారణకు టీకాలు

Published Sat, May 25 2024 3:55 PM

చిటుకు రోగం నివారణకు టీకాలు

జనగామ: గొర్రెల్లో చిటుకు రోగ నివారణకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో టీకా కార్యక్ర మం ప్రారంభమైంది. నాలుగేళ్ల క్రితం జిల్లా పరిధి 59 గ్రామాల్లో గొర్రెలకు చిటుకు రోగం వ్యాపించడంతో నివారణకు ఐదేళ్ల పాటు వరుసగా ముందస్తు టీకాలు వేయడానికి నిర్ణయించారు. చిటుకు రోగం నిర్ధారణ అయిన గ్రామాల పరిధిలో 2,25, 610 గొర్రెలను గుర్తించారు. బచ్చన్నపేట మండలంలో 26,526, చిల్పూరు 9,601, దేవరుప్పుల 16,582, జనగామ 13,012, కొడకండ్ల 18,501, లింగాలఘణపురం 37,233, నర్మెట 7,899, పాలకుర్తి 26,250, రఘునాథపల్లి 17,195, స్టేషన్‌ఘన్‌పూర్‌ 22,740, తరిగొప్పుల 4,663, జఫర్‌గఢ్‌లో 25,410 గొర్రెలకు టీకాలు వేయనున్నారు.

వైద్యులను సంప్రదించండి

గతంలో చిటుకు రోగం వ్యాప్తి చెందిన గ్రామాల్లో సంబంధిత గొర్రెల యజమా నులు పశుసంవర్ధక శాఖ వైద్యులను సంప్రదించి జీవాలకు టీకాలు వేయించాలని జిల్లా అధికారి డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. వర్షాకాలం తొలకరి జల్లులతో పచ్చిగడ్డి మేసే సమయంలో క్లాస్టీడియం బ్యాక్టీరియా సోకడంతో చిటుకు రోగం వస్తుందని చెప్పారు. ఈ వ్యాధి సోకిన గొర్రెలకు వైద్యం చేయించేలోపే మృత్యువాత పడే అవకాశం ఉంటుందని, ముందుగానే టీకాలు వేయిస్తే మరణాలను నివారించవచ్చన్నారు. 59 గ్రామాల పరిధిలో టీకాలు పూర్తయ్యే వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు.

జిల్లాలో 59 గ్రామాల గుర్తింపు

2.25లక్షల జీవాలకు టీకాలు

Advertisement
 
Advertisement
 
Advertisement