ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో పని చేస్తున్న ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవవ్ అన్నారు. మార్కెట్ యార్డులో మంగళవారం ఏఎంసీ, అడ్తీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికోవర్, శరత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించగా, చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు, హమాలీలు, ట్రేడర్స్, అడ్తిదారులు, దడువాయిలు, మార్కెట్ సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, డైరెక్టర్లు బొట్ల నర్సింగరావు, నీల మోహన్, శ్రీలత రెడ్డి, తోటకూరి రమేష్ యాదవ్, బానోతు బన్సీ నాయక్, బంధ కుమార్, అడ్తి అసోసియేషన్ అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న, బుస్స లింగమూర్తి, ఉపేందర్, గోవింద్, సురేష్, కృష్ణారెడ్డి, అశోక్, నాయకులు ఉన్నారు.
ఎంపీ గారూ ప్రొటోకాల్ ఇదేనా?
జనగామ వ్యవసాయ మార్కెట్‌ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం సందర్శించిన సమయంలో పాలకవర్గ చాంబర్ ఏఎంసీ చైర్మన్ కుర్చీలో కూర్చొని ప్రొటోకాల్ మరచి పోయారని చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అ న్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎంపీ రైతులతో మాట్లాడడం బాగానే ఉన్నప్పటికీ బీజేపీ సమావేశంగా మార్చారన్నారు. ప్రొటోకాల్ పాటించడంలో మీ సంస్కారం ఇదేనా? గతంలో కూడా మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఎంపీ ఇలా వ్యవహరించడం బాగోలేదన్నారు. తమకు సమాచారం ఇచ్చి ఉంటే ఘనంగా ఆహ్వానించే వారమన్నారు. ఇలా విలువలు లేని రాజకీయం చేయడం ఎంపీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
వ్యవసాయ మార్కెట్ చైర్మన్
బనుక శివరాజ్
మార్కెట్‌లో మెగా వైద్యశిబిరం
Comments
Please login to add a commentAdd a comment