సర్వే ప్రక్రియ గడువులోగా పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
బచ్చన్నపేట: కుల గణన సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పోచన్నపేట గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తీరును పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ఎలాంటి తప్పులు లేకుండా కుటుంబ వివరాలను నమోదు చేయాలన్నారు. అలాగే మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను పరిశీలించి సమాచార సర్వేఫార్మ్లకు పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రామారావునాయక్, తహసీల్దార్ ప్రకాష్‌రావు, ఎంపీడీఓ మల్లికార్జున్, అధికారులు, ఇబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment