వైద్యకళాశాలలో ‘వైట్‌కోట్’ వేడుకలు
జనగామ: జనగామ మెడికల్ కళాశాలలో మంగళవారం ‘వైట్‌కోట్’ వేడుకలను నిర్వహి ంచారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావు ఆధ్వరంలో ఆయా విభాగాల హెచ్‌ఓడీలు శ్రీధర్, జితేంద్ర, శారద, విమల థామస్, మధుసూదన్ రెడ్డి (ఈఎన్‌టీ), పి.అనురాధ, ఎం.ప్రసన్న, జి.జ్యోతిలక్ష్మి, ఎస్.శకుంతల, పి.పద్మ, బి.విశ్వనాధ్, మధుసూదన్‌రెడ్డి(చిన్న పిల్లల స్పెషలిస్టు), ఎండీ అన్వర్, శ్రీధర్, పద్మిని, చంద్రభానుగుప్త, శ్రీహరి పర్యవేక్షణలో లెక్చర్ గ్యాలరీ–1లో జరిగిన మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ 100 మంది విద్యార్థులకు వైట్‌కోట్ వేశారు. డాక్టర్ విద్య కోర్సు మొదలయ్యే క్రమంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు తెల్లని కోట్ వేయడం ఆనవాయితీ. ఎంబీబీఎస్ విద్యార్థులు కోట్ వేసుకున్న తర్వాత ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారితో కలిసి ర్యాగింగ్ నిరోధంపై ప్రతిజ్ఞ చేయించారు. కోర్సు పూర్తయ్యే వరకు సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో చదువుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావు సూచించారు. ర్యాగింగ్ అనే పదం వినిపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కళాశాలలో నిఘా ఉందని, విద్యాబోధనతో పాటు విద్యార్థుల కదలికలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment