బుధవారం శ్రీ 13 శ్రీ నవంబర్ శ్రీ 2024
నిత్యం వాహనాల రద్దీ..
కాళేశ్వరం పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లే భక్తులు, మేడిగడ్డ ప్రాజెక్ట్, పంప్‌హౌస్ వద్దకు సామగ్రి తీసుకెళ్లే భారీ వాహనాలు, ఇసుక క్వారీల నిర్వహణ కారణంగా లారీల రాకపోకలతో ఈ రహదారి వెంట వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో సాధారణ వాహనదారులు ఈ రహదారి గుండా ప్రయాణించడం నరకప్రాయంగా మారిపోయింది. రోజురోజుకూ వాహనాల రాకపోకలు ఎక్కువ అవుతుండటంతో ప్రమాదాలు సైతం అధికంగా పెరిగిపోతున్నాయి.
కాటారం: జిల్లాలో 58 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 353(సీ) జాతీయ రహదారిపై మలుపులు ప్రమాదకరంగా మారాయి. 32 ప్రాంతాల్లో మలుపులు ఉండగా.. ఎక్కడా సూచిక బోర్డులు ఏర్పాటుచేసిన పరిస్థితి లేదు. దీంతో రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. పలువురు మృత్యువాత పడుతుండగా.. చాలామంది గాయాలపాలవుతున్నారు. అయినప్పటికీ నేషనల్ హైవే అథారిటీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
32 మలుపులు..
మహారాష్ట్ర సిరొంచ నుంచి మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని అంతర్రాష్ట్ర వంతెన మీదుగా రేణిగుంట వరకు అధికారులు జాతీయ రహదారి నిర్మించారు. దీనికి 353(సీ) జాతీయ రహదారిగా నామకరణం చేశారు. ఈ జాతీయ రహదారి జిల్లాలోని కాళేశ్వరం, మహదేవపూర్, కాటారం, భూపాలపల్లి, గణపురం మీదుగా వెళ్తుంది. కాళేశ్వరం నుంచి మొదలుకొని భూపాలపల్లి వరకు 58 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రహదారి వెంట సుమారు 32 వరకు మలుపులు ఉన్నాయి. పేరుకే జాతీయ రహదారి అయినప్పటికీ మలుపు వద్ద ఎక్కడ కూడా సూచిక బోర్డులు లేవు. కాళేశ్వరం నుంచి భూపాలపల్లి వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అనేక ప్రమాదకరమైన మలుపులు ఉండటంతో హెచ్చరిక బోర్డులు లేని కారణంగా నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మలుపుల వద్ద పిచ్చి మొ క్కలు ఏపుగా పెరగడం ప్రమాదాలకు మరో కారణంగా నిలుస్తుంది. ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, సూచిక బోర్డులు లేని కారణంగా ఈ రహదారి వెంట కొత్తగా ప్రయాణించే వారు వేగాన్ని అ దుపు చేసుకోలేక ఎదురుగా వచ్చే వాహనాన్ని గమనించక ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు.
న్యూస్‌రీల్
ప్రమాదకరంగా 353(సీ) జాతీయ రహదారి
రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలు
మలుపుల వద్ద కానరాని సూచికబోర్డులు
పట్టించుకోని ఎన్‌హెచ్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment