గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై రాష్ట్ర సాంస్కృతి సారథి కళా బృందం ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ వరకు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్ వద్ద తెలంగాణ సాంస్కృతిక కళాయాత్ర ప్రదర్శనల కోసం వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయగా ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం ధరూరు మండల కేంద్రంతో పాటు, భూరెడ్డిపల్లి, మార్లబీడులో కళాకారులు సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజావిజయోత్సవాలు ఈనెల 19డిసెంబర్ 7వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మీ, గృహజ్యోతి, రైతురుణ మాఫీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటిపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గురువారం స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాలులో సాయంత్రం 5గంటలకు ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాలను రాష్ట్రస్థాయి కళాకారులతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రజా సమస్యల
పరిష్కారానికి కృషి
అయిజ: ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తామని, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయనతోపాటు ఎమ్మెల్యే విజయుడు మండల కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ నాయకుడు జహీర్ మృతదేహానికి పూలమాలవేసి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బీఆర్‌స్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్డీఎస్ ద్వారా యాసంగి పంటలకు నీరు అందించేలా కృషిచేస్తానని, పట్టణంలోని తిక్కవీరేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అదికారులను ఆదేశిస్తామని అన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రోగులతో, వైద్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వైద్యులు సకాలంలో ఆస్పత్రికి చేరుకొని రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని,30 పడకల ఆస్పత్రి నిర్మాణం పనులు నిలిచి పోయాయని, త్వరలోనే పనులు పూర్తిచేసేవిధంగా కృషిచేస్తానని అన్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
ఎర్రవల్లి మండలం కొండేరు శివారులోని కంపెనీ నుంచి వస్తున్న విష వాయువులతో కొండేరు, జింకలపల్లి, షేక్‌పల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీ యాజమాన్యంపై చర్యతీసుకోవాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, పలువురు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment