జిల్లాలో సంఘటనలు ఇలా..
● 27.01.2025 తేదీన గద్వాల పట్టణంలోని బీరోలు చౌరస్తాలోని ఓ ఇంటిని కడప జిల్లా ఇందిరానగర్‌కు చెందిన రమణయ్యగౌడ్, జిల్లాలోని కేటీదొడ్డి మండలం మల్లాపురం తండాకు చెందిన వీరేష్ నాయక్ అద్దెకు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలను ఇక్కడి రప్పించి వ్యభిచార దందాను నిర్వహిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు గద్వాల పట్టణ పోలీసులు దాడి చేసి విటులను, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
● 2024 డిసెంబర్ 26వ తేదీన మల్దకల్ మండలం పాల్వాయి గ్రామానికి చెందిన వరుణ్(తిరుమలేష్), గద్వాల పట్టణానికి చెందిన వెంకీ అను ఇద్దరు యువకులు పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని గత కొన్ని రోజులుగా ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతులతో వ్యభిచార దందాను నిర్వహిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను గుర్తించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు దాడి చేసి విటులను, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
● 2024 జనవరి 31వ తేదీన కేటీదొడ్డి మండలం మల్లాపురం తండాకు చెందిన వీరేష్‌నాయక్ గద్వాల పట్టణంలోని ఐడీఎస్ఏంటీ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలతో కొన్ని రోజులుగా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. అయితే కాలనీ వాసులకు అనుమానం కలగడంతో అర్ధారాత్రి పోలీసులకు సమాచారం అందించి గుట్టును రట్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
● 2024 ఆక్టోబర్ 5వ తేదీన ధరూర్ మండలం జాంపల్లి గ్రామానికి చెందిన కృష్ణవర్ధన్, జిల్లా కేంద్రానికి చెందిన సమీర్‌కుమార్ యువకులు జములమ్మ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని కొంత మంది యువతులను రాత్రి సమయాల్లో తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇంటిపై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో 2023లో శ్రీ సాయి హోం కాలనీ, బీరోలు రోడ్డు మార్గంలో, రెవెన్యూ కాలనీ, జమ్ములమ్మ రోడ్డు మార్గం, పలు లాడ్జీలలో వ్యభిచార దందా నిర్వహిస్తున్న నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment