జాబ్డ్రైవ్ను సద్వినియోగం చేసుకోండి
గద్వాల: నిరుద్యోగ యువతి, యువకులకు జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఎంఏఎల్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ జాబ్ డ్రైవ్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి 30వ తేదీన ఉదయం 9:30గంటలకు జాబ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18–24 వయసున్న ఇంటర్ (ఎంపీసీ, బైపీసీ), డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు అదేవిధంగా ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఎంపికై న అభ్యర్థులకు వార్షిక వేతనం రూ.2లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎంపికై న ఇంటర్ విద్యార్థులకు ఉన్నత విద్యకు అవసరమైన ప్రత్యేక సహాయం, రవాణ సౌకర్యం, నైట్‌షిప్ట్, సబ్సీడితో కూడి క్యాంటిన్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, కాలేజీ ప్రిన్సిపల్ కలాందర్బాషా, రాధిక, సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంలకు పటిష్ట భద్రత..
స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చిన ఈవీఎం మిషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఆయన ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. స్ట్రాంగ్్ రూంల వద్ద సీసీ కెమెరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ మల్లీకార్జున్,ఎన్నికల సూపరిండెంట్ కరుణాకర్, సురేష్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment