లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి

Published Thu, Jan 30 2025 1:58 AM | Last Updated on Thu, Jan 30 2025 1:58 AM

లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి

లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి

గట్టు: ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని గద్వాల డీఎస్పీ మొగులయ్య కోరారు. బుధవారం చాగదోన ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్‌ సహకారంతో సమకూర్చిన స్టడీ మెటీరియల్‌ను డీఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి బావి భారత పౌరులని, ప్రతి విద్యార్థి ప్రణాళికా ప్రకారం చదువుకోవాలని, వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని, బట్టీ పట్టడం ద్వారా ఉపయోగం ఉండదన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు 45 రోజులు ఉందని, ప్రణాళికా ప్రకారం చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అమ్మాయిలను చక్కగా చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మోటివేషనల్‌ స్పీకర్‌ ఉరుకుందుశెట్టి మాట్లాడుతూ ..మోబైల్‌ ఫోన్లు, టీవీలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, నోట్‌లను ప్రిపేర్‌ చేసుకోవాలని, సమయపాలన పాటించాలని, చదువుకున్న వాటిని మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటే పది పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులతో బయట పడతారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐ మల్లేష్‌, మాజీ సర్పంచులు శంకరన్న, నర్సింహులు, హెడ్మాస్టర్‌ మోహన్‌రెడ్డి,అయ్యస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement