ప్రజల ఆకాంక్ష మేరకే ఎర్రవల్లి మండలం | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆకాంక్ష మేరకే ఎర్రవల్లి మండలం

Published Thu, Jan 30 2025 1:58 AM | Last Updated on Thu, Jan 30 2025 1:58 AM

ప్రజల ఆకాంక్ష మేరకే ఎర్రవల్లి మండలం

ప్రజల ఆకాంక్ష మేరకే ఎర్రవల్లి మండలం

ఎర్రవల్లి: ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం ఎర్రవల్లిని నూతన మండలంగా ప్రకటించడం జరిగిందని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం ఎర్రవల్లి మండల కేంద్రంలో నూతన మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎర్రవల్లి మండలంగా ఏర్పాటయ్యాక ప్రజలకు పరిపాలనతోపాటు అన్ని సౌకర్యాలు మెరుగయ్యాయన్నారు. వందలాది మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థిక పురోగాభివృద్ధి జరుగుతుందన్నారు. మండలానికి అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కేజీబీవీ, పోలీస్‌స్టేషన్‌, గురుకుల పాఠశాల, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, విద్యుత్‌ తదితర కార్యాలయాలు త్వరలోనే ఏర్పాడతాయని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మెన్‌ నీలి శ్రీనివాసులు, ఎంపీడీఓ సయ్యద్‌ఖాన్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రంగారెడ్డి, నాయకులు హనుమంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, కిశోర్‌, మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

స్వల్ప వాగ్వాదం..

ఇదిలాఉండగా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాసులు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల గురించి వివరిస్తుండగా.. ఎమ్మెల్యే ఒక్కసారిగా మైక్‌ తీసుకొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని సక్రమంగా అమలు చేసిందో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను అడగండి, సరైన సమాధానం చెబుతారని అనడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు సర్ది చెప్పడంతో వాగ్వాదం సద్దుమనిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement