పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ఒక ట్రాన్స్‌జెండర్ ప్రకటించగా.. తాజాగా ఓ చర్మకారుడు కూడా ఆయనపై పోటీకి సిద్ధమంటున్నాడు. డిగ్రీ చదువుకున్నా కానీ కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పట్టభద్రుడిని కాబట్టే చట్ట సభలకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అందుకే పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని అంటున్నారు పిఠాపురానికి చెందిన చర్మకారుడు ఏడిద భాస్కరరావు. పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కాలేజీ వద్ద చెట్టు కింద 20 ఏళ్లుగా చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి సోమవారం నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినీ యాక్టర్ పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారని, ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి అందరూ పోటీ చేస్తూంటే స్థానికుడిగా బీఏ పొలిటికల్ సైన్స చదువుకున్న తానెందుకు పోటీ చేయకూడదని అనిపించిందన్నారు. అందుకే నాలుగు నెలలుగా నియోజకవర్గ సమస్యలను పత్రికల ద్వారా సేకరించానన్నారు.
పిఠాపురంలో ఇప్పుడు పవన్ పరిష్కరిస్తానంటున్న సమస్యలను తాను 4 నెలల క్రితమే గుర్తించానన్నారు. పేద కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి, ప్రజల సమస్యలు తీర్చాలంటే చట్ట సభలే వేదిక అని తలచి పోటీలో ఉండాలనుకుంటున్నానన్నారు. తనకు తెలిసిన వారందరి మద్దతూ కోరుతున్నానని, చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. ఎలాగైనా పవన్ కల్యాణ్‌పై గెలుస్తాననే నమ్మకం తనకుందన్నారు. త్వరలో తాను కూడా ఓ మేనిఫెస్టో తయారు చేసుకుని, ప్రకటిస్తానని భాస్కరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment