నూరేళ్ల పంటకు ఏరువాక!
● మాఘమాసం రావడంతో
శుభ ముహూర్తాలకు వేళ
● నేటి నుంచి పెళ్లి సందడి
● కల్యాణ మండపాలకు,
ఈవెంట్ నిర్వాహకులకు, వివిధ
కళాకారులకు డిమాండ్
బిక్కవోలు/కొత్తపేట: మాఘమాసం ప్రారంభమైంది. వివాహాల సందడి ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచి ముహూర్తాలు మొదలయ్యాయి. పరిణయ ముహూర్తాలను వెంటబెట్టుకొచ్చిన ఈ మాసం నుంచి పెళ్లిళ్లే కాకుండా నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, నామకరణోత్సవాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు.. తదితర శుభకార్యాలతో ఇంటింటా బాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాలు మోగనున్నాయి. కల్యాణ వేదిక లు ముస్తాబయ్యాయి. శుక్రవారం తొలి ము హూర్తాన అనేక జంటలు ఒక్కటి కానున్నాయి.
కల్యాణ మండపాలకు డిమాండ్
రెండు మూడు నెలలుగా సంబంధాలు కుదిరిన జంటలకు తల్లిదండ్రులు మాఘమాసంలో వివాహాలు జరిపిస్తున్నారు. అందు వల్ల అనేక మంది ముందుగానే కల్యాణ మండపాలను బుక్ చేసుకోవడంతో వాటికి డిమాండ్ నెలకొంది. కల్యాణ మండపాలు దొరకనివారు తమ ఇళ్ల వద్ద, విశాలమైన ఖాళీ స్థలాల్లో వివాహాలను జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుభకార్యాల సీజన్ ప్రారంభం కానుండటంతో వివిధ వ్యాపారాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా దుస్తులు, బంగారం, అలంకరణ వస్తువులు, శుభకార్యాలకు అవసరమయ్యే సా మగ్రి, పూల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.
స్టేటస్ కోసం.. తగ్గేదేలే
ప్రస్తుతం ధనవంతులు తమ పిల్లలకు జరిపే వివాహాలు వారి స్టేటస్‌కు సింబల్‌గా మారాయి. ఆర్థిక పరిపుష్టిగల వారు వివాహాల కోసం ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ప్రతిదీ గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. వివాహ సమయంలో డెకరేషన్, విందు కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అత్యాధునిక కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీయించేందుకు కూడా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.
అనేక మందికి ఉపాధి
వివాహాలు, శుభకార్యాలు ప్రారంభం కావడంతో ప్రధానంగా పురోహితులకు, డెకరేషన్, మంగళ, బ్యాండు వాయిద్య కళాకారులకు, ఫొటో, వీడియో గ్రాఫర్స్, కల్చరల్ ఈవెంట్ ఆర్గనైజర్లు (ఆర్కెస్ట్రా), క్యాటరింగ్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులకు, ట్రావెల్స్ ఏజెన్సీలకు డిమాండ్ ఏర్పడింది. అందువల్ల ఆయా వ్యాపార వర్గాల వారికి చేతినిండా పని లభించడంతో శుభకార్యాలు వారి ఉపాధికి దోహదపడుతున్నాయి.
డ్రోన్ ఫొటోగ్రఫీకి గిరాకీ
ఫొటోగ్రఫీ, వీడియోలకు గిరాకీ పెరిగింది. గగనతలం నుంచి అత్యంత క్వాలిటీతో ఫొటోలు, వీడియోలు తీయడం డ్రోన్ ఫొటోగ్రఫీ విశిష్టత. దీంతో దీనికి ఆదరణ పెరిగింది. డ్రోన్‌తో ఫొటోలు, వీడియోలు తీసేందుకు వ్యాపారులు ఒక్కో కార్యక్రమానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ తీసుకుంటున్నారు. దీనికి ప్రింటింగ్ ఖర్చులు అదనం.
బ్యాండు మేళాలకు డిమాండ్
వధూవరులను సిద్ధం చేయడం దగ్గర నుంచి పెళ్లయి మళ్లీ వారిని ఇంటికి తీసుకొచ్చే వరకూ మంగళ వాయిద్యాల అవసరం ఉంటుంది. బ్యాండ్ మేళం వారు ఒక్కో కార్యక్రమానికి రూ.10 వేలకు పైగా తీసుకుంటున్నారు. కొందరు పెళ్లిలో సంగీత విభావరులు నిర్వహిస్తున్నారు. దీనికి రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకూ తీసుకుంటున్నారు.
విందుకు ప్రత్యేక స్థానం
విందు లేనిదే పెళ్లి ఉండదు. దీనికి చాలామంది అధిక ప్రాధాన్యం ఇస్తారు. భోజనాలు రుచిగా.. శుచిగా ఉండాలని బంధుమిత్రుల్లో మాట రాకూడదని భావిస్తారు. అందుకే ఎంత ఖర్చయినా వెనుకాడరు. ఇప్పడు ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకూ ఇలా పెళ్లి అయిపోయేవరకూ సరఫరా చేసే క్యాటరింగ్ సంస్థలు చాలానే ఉన్నాయి. మెనూ ప్రకారం ధరలు వసూలు చేస్తారు. ఎంచుకున్న పదార్థాలను బట్టి ప్లేట్ ధర రూ.120 నుంచి రూ.350 వరకూ ఉంటుంది.
పసిడి, పూల ధరలు ౖపైపెకి..
ఈ మాసంలో పెళ్లి ముహూర్తాలు, పండగలు ఎక్కువగా ఉండటంతో వివిధ వస్తువుల, పూల ధరలు బాగా పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment