పకడ్బందీగా సర్వే నిర్వహించాలి
కామారెడ్డి క్రైం : సమగ్ర ఇంటింటి కుటుంబ స ర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆ శిష్ సంగ్వాన్ అఽధికారులకు సూచించారు. ప్రతి ఇంటిని సర్వే చేయాలన్నారు. సోమవారం పట్టణంలోని 44 వ వార్డులో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ ప్రశ్నావళి ప్రకారం ఆయా కు టుంబాల్లోని పూర్తి సమాచారాన్ని సేకరించాలన్నారు. తప్పులు లేకుండా సమాచారం సేకరించాలని సూచించారు. ప్రతి ఎన్యుమరేటర్ రో జుకు 15 నుంచి 20 ఇళ్లలో సర్వే చేపట్టాలని సూచించారు. వేగంగా సర్వే పూర్తి చేయాలన్నా రు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్‌రావు, త హసీల్దార్ జనార్దన్, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత స్థానానికి చేరుకోవాలి
ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలను సోమవారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఐఐటీ, ట్రిపుల్ ఐటీలలో సీటు సాధించేందుకు కృషి చేయాలన్నారు. చదువుతో పాటు, క్రీడల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ, మైనారిటీ సంక్షేమశాఖ జిల్లా అధికారి దయానంద్, ఆర్‌ఎల్‌సీ కిరణ్ గౌడ్, ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం, ప్రిన్సిపాల్ ప్రణిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న
కలెక్టర్ సంగ్వాన్
కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసి న సమావేశంలో ఆయన మాట్లాడారు. టార్పాలిన్‌లు, గోనె సంచులు సిద్ధంగా ఉంచాలని సూ చించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. ట్యాబ్ ఎంట్రీలు త్వరగా పూర్తి చే యాలన్నారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య తెలిపారు. సోయా కొనుగోళ్లు సైతం ప్రా రంభించామని మార్క్‌ఫెడ్ జిల్లా ఇన్‌చార్జి మేనే జర్ మహేశ్ తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.విక్టర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్‌చార్జి డీఎస్‌వో నరసింహారావు, సహకార అధికారి రామ్మోహన్, డీపీఎం రమేశ్ బాబు పాల్గొన్నారు.
ప్రతి ఇంటిని సర్వే చేయాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment