లక్ష్యం నెరవేరేనా?
పెద్ద సైజ్‌వే వదులుతున్నాం
గతంలో చిన్న సైజ్ చేప పిల్లలు వచ్చాయి. దీంతో సీఎం రెండుసార్లు టెండర్ క్యాన్సిల్ చేయించారు. ఇప్పుడు పెద్దసైజ్‌వే వస్తున్నాయి. పెద్ద సైజ్ చేప పిల్లలనే చెరువుల్లో విడుదల చేస్తున్నాం. మత్స్యకారులు కూడా సంతోషంగా ఉ న్నారు. – సత్యనారాయణ,
అధ్యక్షుడు, జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం
బాన్సువాడ : ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది జిల్లాలో మొట్టమొదట బాన్సువాడ కల్కి చెరువులో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తు న్న చేపపిల్లలపై మత్స్యకారులు పెదవి విరుస్తున్నా రు. చిన్నసైజువి పంపిణీ చేస్తుండడంతో అవి ఎదగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 80 నుంచి 100 మిల్లీ మీటర్ల సైజులో ఉన్న చేప పిల్లలను సరఫరా చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్లు అంతకన్నా తక్కువ సైజున్న చేప పిల్లలను విడుదల చేస్తున్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ అధికారులను మచ్చిక చేసుకుని తక్కువ సైజున్న చేపపిల్లల్ని చెరువుల్లో విడుదల చేస్తున్నారన్న ఆరో పణలున్నాయి. బాన్సువాడ కల్కి చెరువులో చేప పిల్లల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. చేప పిల్ల ల సైజును కొలిచారు. తక్కువ సైజులో ఉండడంతో మత్య్సశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లలు తక్కువ సైజులో ఉంటే ఎక్కువ శాతం చనిపోయే ప్రమాదముందని, చిన్న సైజులో ఉన్న చేప పిల్లలను చెరువులలో వదలొద్దని అధికారులకు సూచించారు. చేప పిల్లల్ని తిప్పి పంపించాలని ఆదేశించారు. కానీ అధికారులు మాత్రం ఎమ్మెల్యే అక్క డి నుంచి వెళ్లిపోగానే చిన్న సైజు చేప పిల్లలనే కల్కి చెరువులో వదిలి చేతులు దులుపుకున్నారు.
వానాకాలం ముగిసినా..
జిల్లాలో 225 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలో 15 వేల మంది మత్స్యకారులు సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏటా వర్షాకాలంలో చేప పిల్లలను ఉచితంగా అందిస్తోంది. జిల్లాలోని నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టులతోపాటు 798 చెరువుల్లో కలిపి ఈ ఏడాది 1.45 కోట్ల చేప పిల్లలను వదలాలన్నది సర్కారు లక్ష్యం. కాగా ఇప్పటివరకు 55 శాతమే లక్ష్యాన్ని చేరుకున్నారు. మరో వారంలో వందశాతం లక్ష్యాన్ని చేరుకుంటామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఆలస్యంగా వేసే చేప పిల్లలు సరిగా ఎదగవన్న అభిప్రాయం మత్స్యకారుల్లో వ్యక్తమవుతోంది. గతంలో ఆలస్యంగా చేప పిల్లలను వదిలినప్పుడు అవి రెండు కిలోలకు మించి ఎదగలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఈసారి మరింత ఆలస్యం కావడంతో రెండు కిలోలు కూడా ఎదుగాతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 1.45 కోట్ల చేప పిల్లలు
విడుదల చేయాలన్నది లక్ష్యం
ఇప్పటివరకు 55 శాతమే పూర్తి
చిన్న సైజ్ చేపపిల్లలు పంపిణీ
చేస్తున్నారంటున్న మత్స్యకారులు
చేప ఎదుగుదలపై ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment