గ్రూప్–3ని పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం : గ్రూప్–3 పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో గ్రూప్–3 పరీక్ష నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 17, 18 తేదీలలో పరీక్షలు జరగనున్నాయన్నారు. 8,268 మంది అభ్యర్థులకోసం జిల్లా కేంద్రంలో 20 కేంద్రాలు ఏర్పాటు చేశా మని తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కేంద్రాలను పోలీసు అధికారులు ముందస్తుగా స్క్రీనింగ్ చేయాలని సూ చించారు. ప్రహరీ లేని కేంద్రాలకు అదనంగా పోలీ సు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఆర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్, క్యాలికులెటర్, ఎలక్ట్రానిక్ గూడ్స్, గాడ్జెస్‌ను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరికీ సెల్‌ఫోన్‌లకు అనుమతి లేదన్నారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్‌లను నియమించి, ఈ నెల 14 న శిక్షణ ఇవ్వాలని సూచించారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడిపించాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలను శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. బయటి వ్యక్తులు, మీడియా ప్రతినిధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకూడదన్నారు. సమావేశంలో అదనపు కలెక్ట ర్లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్, ఏఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీ నాగేశ్వర్‌రావు, గ్రూప్–3 పరీక్షల రీజనల్ కోఆర్డినేటర్ విజయకుమార్, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, జెడ్పీ సీఈవో చందర్, డీఈవో రాజు పాల్గొన్నారు.
8,268 మంది అభ్యర్థులకోసం
20 కేంద్రాల ఏర్పాటు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment