రహదారికి ధాన్యపు సిరి
తూకం వేస్తున్న హమాలీలు
నూర్పిడి చేసిన వడ్లను
రోడ్డుపక్కన పోస్తున్న దృశ్యం
కామారెడ్డి–మెదక్
రహదారిపై వడ్ల కుప్పలు
వడ్లను తూర్పారబడుతున్న మహిళా రైతులు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది. రైతులు నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెడుతున్నారు. పొల్లు లేకుండా చూసేందుకు తూర్పారబడుతున్నారు. ఆరిన ధాన్యాన్ని గోనె బస్తాల్లో నింపి తూకం కోసం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. కాంటా అనంతరం లారీల్లో నింపి రైస్‌మిల్లులకు చేరుస్తున్నారు. వరి కోతలు జోరందుకోవడంతో కామారెడ్డి నుంచి రాజంపేట మీదుగా మెదక్ వెళ్లే రహదారిపై ఆర్గొండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి, గుండారం, గుండారం తండాల పరిధిలో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment