రేపు దిశ సమావేశం
కామారెడ్డి అర్బన్ : కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 11గంటలకు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఆర్డీవో సురేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అభివృద్ధి పథకాలపై సమీక్ష ఉంటుందని, జిల్లాలోని శాసన సభ్యులు, అధికారులు హాజరు కావాలని కోరారు.
‘పోషక విలువలున్న
చేపలు పెంచాలి’
కామారెడ్డి అర్బన్ : అత్యంత పోషక విలువలున్న చేపలను పెంచడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి పేర్కొన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీపతి మాట్లాడు తూ కళాశాలలో చేపల పెంపకంపై ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ ఆసక్తిగా ఉన్నారని, దీనిని వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, ఫిషరీస్ హెచ్‌వోడీ తిరుమల మల్సూర్, సమన్వయకర్తలు జయప్రకాష్, దినకర్, శ్రీనివాస్, అధ్యాపకులు మానస, పవన్‌కుమార్, అరుణ తదితరులు పాల్గొన్నారు.
మరో రూ.20 లక్షలు మంజూరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్ర భుత్వ సాయం అందించేందుకుగాను జిల్లా కు మరో రూ.20 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో కుటుంబాని కి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అంది స్తోంది. తొలి విడతగా గతనెలలో రూ.20 ల క్షలు విడుదలైన విషయం తెలిసిందే.
డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు
భిక్కనూరు: విద్యుత్ అధికారులు ట్రాన్స్‌ఫా ర్మర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని రామేశ్వర్‌పల్లికి చెందిన రైతు పెద్దోళ్ల శరత్‌రె డ్డి ఆరోపించారు. గతేడాది జనవరి 15న భి క్కనూరు శివారులోని తన పొలం వద్దను న్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగలు ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ కాయిల్స్‌ను ఎత్తుకెళ్లారని తెలిపారు. అప్పటి నుంచి వి ద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా తన కు ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గురువారం డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫ్యాక్స్ ద్వా రా ఫిర్యాదు చేశానని, వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయాలని కోరానన్నారు.
మహిళా శక్తి భవనానికి నిధులు మంజూరు
కామారెడ్డి క్రైం : జిల్లా కేంద్రంలో ఇందిర మ హిళా శక్తి భవన నిర్మాణం చేపట్టడానికి ప్ర భుత్వం నిధులు మంజూరు చేసిందని కలెక్ట ర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. మహిళా శక్తి భ వన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని గు రువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి భ వన నిర్మాణానికి పట్టణ సమీపంలోని జాతీ య రహదారి పక్కన ఉన్న సర్వే నంబర్ 527లో ఎకరం భూమిని కేటాయించామన్నా రు. ఇక్కడ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్‌రావు, జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి సురేందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గాప్రసాద్, డీపీఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు అండర్–19
కబడ్డీ ఎంపికలు
కామారెడ్డి అర్బన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అండర్–19 ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ చదువు తున్న ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్ సర్టిఫికెట్‌తో ఉదయం 11 గంటలకు వ్యాయామ ఉపాధ్యాయుడు మహేశ్ వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు 23, 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment