‘సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’
కామారెడ్డి అర్బన్: ప్రభుత్వంతో మాట్లాడి ఉపాధ్యాయుల అన్ని సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని పీఆర్‌టీయూ(తెలంగాణ) వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్, సీపీఎస్ రద్దు, అన్ని రకాల గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి 010 పద్దు కింద నెలనెలా జీతాలు చెల్లించడం, మినిమం టైం స్కేల్, క్యాష్‌లెస్ హెల్త్ స్కీం అమలు, ప్రతిఏడాది వేసవి సెలవుల్లో సాధారణ బదిలీలు, ప్రమోషన్లు తదితర డిమాండ్లను సాధించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజం, క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు యుగేందర్‌రెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment