అంత్యక్రియలయ్యాక.. పోస్టుమార్టం | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలయ్యాక.. పోస్టుమార్టం

Published Thu, Nov 23 2023 12:16 AM | Last Updated on Thu, Nov 23 2023 10:55 AM

- - Sakshi

శంకరపట్నం(మానకొండూర్‌): మండలంలోని మొలంగూర్‌ పంచాయతీ పరిధి గూడాటిపల్లికి చెందిన భోజ లక్ష్మి(55) రెండు రోజుల క్రితం మృతిచెందగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. కానీ, ఆమె కూతుళ్ల ఫిర్యాదుతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మి అనారోగ్యంతో బాధ పడుతుండగా కుటుంబసభ్యులు ఈ నెల 16న వరంగల్‌ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ 19న మృతి చెందింది. కుటుంబసభ్యులు ఆమె మృతదేహానికి అదేరోజు తమ వ్యవసాయ పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, లక్ష్మి మృతి విషయంలో అన్న మహేశ్‌, వదినపై అనుమానాలున్నాయని మృతురాలి కూతుళ్లు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం తహసీల్దార్‌ అనుపమ సమక్షంలో లక్ష్మి మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం చేయించినట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement