అక్రమంగా మట్టి తరలింపు
● ఫిర్యాదు చేసినా
పట్టించుకోని అధికారులు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలోని గుట్ట నుంచి అక్రమంగా మట్టి తరలిపోతోంది. పట్టా భూమి పేరిట రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నా రెవెన్యూ అధి కారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు న్నాయి. 15 రోజుల నుంచి గుట్ట ప్రాంతం నుంచి ఓ వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశిపాక రాకేశ్, రమేశ్‌లు తహసీల్దార్ రాజుకు ఫిర్యాదు చేయడంతో పట్టా భూమి అయినప్పటికీ అనుమతి లేకుండా మట్టిని తరలించవద్దని సదరు వ్యక్తికి సూచించారు. అయితే రాత్రివేళల్లో జేసీబీతో మట్టిని తవ్వి టిప్పర్లలో తరలిస్తు న్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అధికారుల అండదండలతోనే అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రాకేశ్, రమేశ్‌లు ఆరోపించారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి గుట్టకు హద్దులను నిర్ణయించి, మట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment