అనారోగ్యంతో విద్యార్థిని మృతి
జమ్మికుంట(హుజూరాబాద్): పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అనారోగ్యంతో ఓ విద్యార్థి మృతిచెందింది. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నిర్ణక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఫిర్యా దుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరంగంటి రవి తెలిపారు. పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన రవి–ఇందిర దంపతులు పట్టణంలోని కేశవపూర్‌లో ఇల్లరికం వచ్చి జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కూతు రు నిత్యశ్రీ(15)ని ప ట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో చేర్పించారు. నిత్యశ్రీ 10వ తరగతి చదువుతోంది. ఈనెల 17న విద్యార్థిని అ స్వస్థతకు గురి కాగా.. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి తి రిగి హాస్టల్‌లో చేర్పించారు. త ర్వాత విద్యార్థిని పరిస్థితి విష మంగా మారగా.. ఇన్‌చార్జి ప్రి న్సిపాల్ సుప్రియ, ఉపాధ్యాయురాలు, ఏఎన్‌ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈనెల 21న తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. నిత్యశ్రీని చికిత్స నిమిత్తం హన్మకొండ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తెలిపారు.
డీఈవో జనార్దన్‌రావు పాఠశాలలో ఆదివారం సాయంత్రం విచారణ చేపట్టారు. విద్యార్థి మృతి విషయాన్ని గోప్యత పాటించి విచారణ జరిపారనే ఆరోపణలున్నాయి. వివరాలు తెలుసుకునేందుకు డీఈవోను ఫోన్ ద్వారా సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment