జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపిక
జ్యోతినగర్: 68వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 కరాటే పోటీల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్ కరాటే పోటీలకు ఎంపికై నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్‌లోని టీవీ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–17 కరాటే పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్–17 బాలికల విభాగంలో 32 కిలోల పోటీల్లో సిరిచందన(మెదక్), 36 కిలోల పోటీల్లో రూపాశ్రీ(నిజామాబాద్), 40 కిలోల పోటీల్లో తనూశ్రీ(వరంగల్), 44 కిలోల పోటీల్లో శ్రీజ(కరీంనగర్), 48 కిలోల పోటీల్లో రక్షిత(కరీంనగర్), 56 కిలోల పోటీల్లో సిరిచందన(మహబూబ్‌నగర్), 60 కిలోల పోటీల్లో ఐశ్వర్య(వరంగల్), 64 కిలోల పోటీల్లో అనూష(ఆదిలాబాద్), 68 కిలోల పోటీల్లో శ్రీహరిణి(వరంగల్), 68 కిలోలు ఆపై విభాగంలో శ్రీహిత రాజ్(కరీంనగర్), బాలుర విభాగంలో 35 కిలోల పోటీల్లో సాత్విక్(కరీంనగర్), 40 కిలోల పోటీల్లో ఆదిత్య తేజ(కరీంనగర్), 45 కిలోల పోటీల్లో శ్రావణ్‌కుమార్(కరీంనగర్), 50 కిలోల పోటీల్లో అన్వేష్(వరంగల్), 54 కిలోల పోటీల్లో హర్షవర్దన్(వరంగల్), 58 కిలోల పోటీల్లో సుభాష్‌రావు(నిజామాబాద్), 62 కిలోల పోటీల్లో శ్రీచరణ్(కరీంనగర్), 66 కిలోల పోటీల్లో ఎండీ ఫియాజొద్దీన్(రంగారెడ్డి), 70 కిలోల పోటీల్లో హర్షవర్దన్(కరీంనగర్), 74 కిలోల పోటీల్లో హర్షతేజ(ఖమ్మం), 78 కిలోల పోటీల్లో షేక్ ఇస్మాయిల్(మెదక్), 82 కిలోల పోటీల్లో మల్లేశ్(మహబూబ్‌నగర్), 82 కిలోల పోటీల్లో షేక్ అబ్దుల్లా(మెదక్) జాతీయస్థాయి కరాటే అండర్–17 పోటీలకు ఎంపికై నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్, ఎంపిక కమిటీ సభ్యులు నారాయణమ్మ, శోభారాణి, ప్రకాశ్ జాబితా విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment