సుమారు ఐదేళ్లపాటు వారిలో ఒకడు.. అందరితో కలిసి రోజూ వాకింగ్ చేసేవాడు.. అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోయాడు భరత్.. చలించిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులు.. తలాకొంత పోగుచేసి, రూ.1.83 లక్షలను అతని కుటుంబానికి అందించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మాటూరి మోహన్ తోటి మిత్రులతో కలిసి రోజూ ఉదయం వాకింగ్ చేసేవారు. కరోనా సమయంలో చనిపోయారు. ఆయన కుటుంబసభ్యులకు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రూ.77 వేలు అందజేశారు.
ఇంతియాజ్ది పేద కుటుంబం. సింగరేణి స్టేడియం బాయ్‌గా పని చేస్తున్నాడు. తన కూతురు వివాహం ఎలా చేసేదని తరచూ మదనపడేవాడు. ఈ విషయం తెలుసుకున్న వాకర్స్ విరాళాలుగా సేకరించిన రూ.1.30 లక్షలను అతనికి అందించి, అండగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment